All About CSC Services Website






రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామ వార్డు సచివాలయం లో CSC  ( కామన్ సర్వీస్ సెంటర్ ) సంబంధించిన సర్వీసులు ప్రారంభమయ్యాయి. మొత్తం 170 వరకు సర్వీస్ లు అందుబాటులో ఉంటాయి. గ్రామా సచివాలయాల్లో  PS Gr-vi (డిజిటల్ అసిస్టెంట్లకు) ,  వార్డు సచివాలయాల్లో  వార్డు ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారికి వారి మొబైల్ నెంబర్, పేరు పై లాగిన్ ఐడి లు ఇవ్వటం జరిగింది. లాగిన్ ఐడి 12 అంకెలు ఉంటుంది. ఆధార్ నెంబర్ కాదు. ఇంకా ఐడి లు ఎవరికీ అయినా అందకపోయి ఉంటే సంబంధిత జిల్లా GSWS టెక్నికల్ టీం వారిని కాంటాక్ట్ అయితే ఇవ్వటం జరుగుతుంది.వారిని కాంటాక్ట్ అయ్యే ముందు పర్సనల్ మెయిల్, సచివాలయం మెయిల్, CSC వాట్సాప్ గ్రూప్ లలో చెక్ చేసి అప్పటికి లేక పోతే టీం వారిని MOT ల ద్వారా కాంటాక్ట్ అవ్వండి. ప్రస్తుతం అన్నీ సర్విస్లు అందుబాటులో ఉన్నాయి .


CSC ఖాతా లో  ఏ విధం గా కొత్త పాస్వర్డ్ ఏర్పాటు చేసుకోవాలి  ?


లాగిన్ ఐడి వచ్చిన తరువాత Password ను సెట్ చేసుకోవటం కోసం


 మొదట  https://digitalseva.csc.gov.in వెబ్ సైట్ ఓపెన్ చేసి కుడి వైపు పైన ఉన్నా Login ఆప్షన్ ను క్లిక్ చేసి Forget Password అనే ఆప్షన్ ను క్లిక్ చేసి User ID, Mail ID ( Personal - Registered ), Captcha Code ఎంటర్ చేసి GET A NEW PASSWORD పై క్లిక్ చేయాలి. మెయిల్ ఐడి కు "Forgot Your Password On Your Project?" అని మెయిల్ వస్తుంది అందులో "Click Here to Create Password" పై క్లిక్ చేయాలి. New Password, Confirm Password దగ్గర కొత్త పాస్వర్డ్ ఎంటర్ చేసి Change Password పై క్లిక్ చేయాలి. Password మారుతుంది. ఒక చోట రాసుకొని జాగ్రత్తగా ఉంచుకోవాలి. CSC హోమ్ పేజీ లో లాగిన్ పై క్లిక్ చేసి User Name లేదా E-mail ID ఎంటర్ చేసి, మార్చిన Password ఎంటర్ చేసి CAPTCHA Code ఎంటర్ చెసి SIGN IN పై క్లిక్ చేయాలి. లాగిన్ అయ్యి హోమ్ పేజీ ఓపెన్ అవుతుంది. 


SC Wallet PIN ను ఎలా మార్చుకోవాలి ?



మొదటి సారి లాగిన్ అయిన వెంటనే Wallet PIN నెంబర్ ను మార్చుకోవాలి. అందుకు గాను Menu లో Account ఆప్షన్ లో My Profile అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. Change Wallet PIN పై క్లిక్ చేసాక రెండు ఆప్షన్ లు చూపిస్తాయి.


1.Do You Know Current Wallet PIN


2.How Do You Want To Receive OTP ?


మొదటి ఆప్షన్ ఎవరు అయితే మొదటి PIN ను సెట్ చేసుకోని దానిని మార్చుకోవాలి అని అనుకుంటారో వారు సెలక్ట్ చేయాలి. అప్పుడు పాత Password, కొత్త Password, కొత్త Password మరలా ఎంటర్ చేసి Submit పై క్లిక్ చేయాలి.


కొత్త గా సెలెక్ట్ చేసిన వారు రెండో ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోని మూడు విధాలుగా కొత్త Password ను పెట్టుకోవచ్చు.


1. Mobile


2. OTP On CSC App


3. Secure Code on CSC App


మొదటిది సెలెక్ట్ చేసుకోని Generate OTP ను క్లిక్ చేస్తే మొబైల్ నెంబర్ కు OTP వస్తుంది. OTP ఎంటర్ చేసాక Submit పై క్లిక్ చేయాలి. అప్పుడు కొత్త PIN ఎంటర్ చేసి మరలా Confirm వద్ద ఎంటర్ చేసి submit పై క్లిక్ చేయాలి.


Wallet లో అమౌంట్ ను వెయ్యడం , తీసివేయటం ఎలా ?


మొదటగా CSC - డిజిటల్ సేవ పోర్టల్ లోకి లాగిన్ అవ్వాలి . Menu లో Wallet ఆప్షన్ పై క్లిక్ చేయాలి . మొదట అమౌంట్ add చేయటానికి Amount దగ్గర ఎంత Add చెయ్యాలో అంతా ఎంటర్ చేయాలి . Transaction Type లో 


1.Add Money ( అమౌంట్ add చెయ్యటం కోసం ) 


2.Revert Money ( అమౌంట్ రిటర్న్ వెయ్యటం కోసం ) 


పై రెండిటిలో ఏది చేస్తున్నారో అది సెలెక్ట్ చేసి Wallet PIN ఎంటర్ చేయాలి .Remarks లో తప్పకుండ సచివాలయం కోడ్ ఎంటర్ చేయాలి . తరువాత Submit పై క్లిక్ చేయాలి . వాలెట్ లోకి అమౌంట్ Add / Remove అవ్వటం జరుగుతుంది . సర్విస్లు చేసే సమయం లో అమౌంట్ సరిపోనట్టు అయితే అమౌంట్ వెంటనే Add చేసుకొని చెయ్యాలి . ఒక్క సారి 50,000 రూపాయలు వరకు Add చేసుకునే అవకాశం ఉంటుంది . 


CSC ట్రైనింగ్ మెటీరియల్ ఎక్కడా దొరుకుతాయి ?


గ్రామ వార్డు సచివాలయం వెబ్ సైట్ హోమ్ పేజీ లో Learning Corner లో Employee Corner ఓపెన్ చెయ్యాలి. CSC Services Training Materials లో CSC Work Flow & CSC Training Material లు అందుబాటులో ఉన్నాయి.



Common Service Center (కామన్ సర్వీస్ సెంటర్ల) ద్వారా అందించే సేవలు


e- Governance సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ (e-Governance Service India Limited) డిజిటల్ సేవా పోర్టల్ (Digital Seva Portla) ద్వారా వివిధ ప్రభుత్వ సేవలను Common Service Center – CSC ల ద్వారా ప్రజలకు అందించవచ్చు. ఈ పోర్టల్‌ను యాక్సెస్ చేయగల వ్యక్తి Village Level Entrepreneur VLE (గ్రామ స్థాయి వ్యవస్థాపకుడు). VLE డిజిటల్ సేవా పోర్టల్‌ ద్వారా ప్రభుత్వాలు, బ్యాంకింగ్, విద్య, ఆరోగ్యం, భీమా సేవలు మరియు మరెన్నో సర్వీస్ లను చేయవచ్చు. CSC Digital Seva పోర్టల్ ద్వారా స్థానిక జనాభాను వివిధ ప్రభుత్వ విభాగాలు, బ్యాంకులు, భీమా సంస్థలు మరియు CSC Center ఉపయోగించి ప్రైవేట్ సేవా రంగాలు అందించే వివిధ సేవలతో కలుపుతుంది. ముఖ్యంగా కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా ఈ క్రింది సేవలు అందించబడుతున్నాయి.


భీమా సేవలు (Insurance services)

పాస్ పోర్ట్ సేవలు (Passport services)

ఎల్‌ఐసి (LIC)

ఎస్బిఐ (SBI)

పెన్షన్ సేవలు (Pension services)

బ్యాంకింగ్ (Banking)

ప్రాథమిక సేవలు (Basic services)

LED MSU సేవలు (LED MSU services)

నైపుణ్య అభివృద్ధి (Skill development)

ఎన్నికల (Election services)

విద్యుత్ బిల్లు చెల్లింపు (Electricity bill payment)

మొబైల్, డిటిహెచ్ రీచార్జ్ సేవలు (Mobile, DTH Recharge Services)

రైల్వే టికెట్ (Railway ticket)

చదువు (Education)

ఆరోగ్య సంరక్షణ సేవలు (Health care services)

కొత్త సేవలు (New services)

కుల ధృవీకరణ పత్రం (Caste certificate)

జనన, మరణ దృవపత్రాల సేవలు (Birth & Death Certificate Services)

నివాస ధృవీకరణ పత్రం (Residence certificate)

పాన్ కార్డు (PAN card)

ఆధార్ సేవలు (Aadhaar Services)





TAGS ::

csc login

csc registration

csc portal

csc digital seva

digimail login

tec registration

digimail


csc registration

digital seva

csc digital seva

nvsp csc login

csc registration 2021

csc portal

e shram csc login

digimail login



digital seva login

digital seva registration

csc registration

digital seva csc gov in

csc login

peindia digital seva

digimail

digital seva setu app


csc login

csc center services list pdf

csc services list in telugu

csc services charges list

csc registration

csc center list

csc official website

csc center near me

Post a Comment

0 Comments