WEA & WEDPS లకు వారానికి మూడు రోజులు స్కూల్ల ఇన్స్పెక్షన్ తప్పనిసరి




 మెమో నెంబర్ ESE01 - SEDN0CSE (MDM)/12/2020 Dt. 04.03.202 ప్రకారం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలల లో మిడ్ డే మీల్స్ మరియు శానిటేషన్ మానిటరింగ్ మరియు సూపర్ విజన్ కోసం నాలుగు అంచెల విధానాన్ని తెలియజేశారు.


మెమో నెంబర్ ESE02 - 27022 /24 /2021 -MDM-CSE, 1505482 ప్రకారం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు రాష్ట్రంలో ఉన్న అందరూ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ మరియు వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ పాఠశాలను వారానికి కనీసం మూడు సార్లు విజిట్ చేస్తూ విజిట్ చేసిన సమాచారాన్ని మొబైల్ అప్లికేషన్లు అప్డేట్ చేయవలసిందిగా తెలియజేశారు.


 పై సమాచారాన్ని జోడిస్తూ గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ వారు రాష్ట్రంలో అందరి జాయింట్ కలెక్టర్ లకు (VWS&D) పై సమాచారాన్ని తెలియజేస్తూ వారు ఎంపీడీవోలు మరియు మున్సిపల్ కమిషనర్లకు పై విషయాన్ని తెలియజేయవలసిందిగా సర్కులర్ ను విడుదల చేయడం జరిగింది.


ముఖ్యంగా వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ మరియు వెల్ఫేర్ అసిస్టెంట్ లు గవర్నమెంట్ మరియు ఎయిడెడ్ స్కూల్లో ను వారానికి కనీసం మూడుసార్లు విజిట్ చేస్తూ ఆ సమాచారాన్ని మొబైల్ అప్లికేషన్లు అప్డేట్ చేయాలి. అదేవిధంగా జగనన్న గోరుముద్ద మరియు టాయిలెట్ మేనేజ్మెంట్ ఫండ్ ఇంప్లిమెంటేషన్ విధానాన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇన్స్పెక్షన్ చేయవలసి ఉంటుంది.

Post a Comment

0 Comments