పంచాయతీ కార్యదర్శి అంటే…..
గ్రామ సచివాలయం యొక్క సాధారణ విధులలో కన్వీనర్ గా పంచాయితీ కార్యదర్శి పాత్ర పరిపాలనపరమయిన విధులు ఆర్దికపరమయిన విధులు సామాజిక, సంక్షేమ మరియు అభివృద్ధి విధులు
పరిపాలనాపరమయిన విధులు
1.పంచాయతీ చట్టమును ననుసరించి పనిచేయాలి
2.గ్రామ పంచాయతీ కార్యనిర్వహణాధికారి & సచివాలయం కన్వీనర్ /కార్యదర్శి
3.గ్రామ పంచాయతీ మరియు సర్పంచ్ అధీనంలో పనిచేయాలి.
4.జి.పి రిజిస్టర్లు , చెక్ బుక్ లకు బాధ్యత వహించాలి
5.పన్నులు ,పన్నేతర లు వసూలు & జమ.
6.గ్రామ పంచాయతీ,గ్రామ సభ,కార్యాచరణ కమిటీలు,ఇతర సమావేశాల ఏర్పాటు , హాజరు ,తీర్మానాల అమలు.
7.ఇతర సచివాలయ సిబ్బంది తో సమన్వయం & పనితీరు పర్యవేక్షణ-క్రమశిక్షణ చర్యలు ప్రతిపాదించు అధికారం
8.గ్రామా పంచాయతి ఆస్తుల పరిరక్షణ.
9.విపత్తుల నిర్వహణ.
10.అంటువ్యాధుల నివారణ.
11.త్రాగునీరు సరఫరా , పారిశుద్ధ్యం , రోడ్లు , వీధి దీపాల నిర్వహణ.
12.మహిళ,శిశు సంక్షేమం.
13.జనన, మరణ,వివాహముల నమోదు మరియు ధ్రువపత్రాలు జారీ.
14.ప్రజల అవసరాలు,సమస్యలు గ్రామ సభ ముందు ఉంచడం.
15.ఎన్నికల విధులు.
16.మహిళలు,చిన్న పిల్లలు,sc/st ల పై అత్యచారాల నివారణ చర్యలు.
17.అంటరానితనం నిర్ములన.
18.కల్తీ ఎరువులు,విత్తనాలు,పురుగుల మందులు విక్రయం పై అధికారులకు సమాచారం.
19.సచివాలయం లో వివిధ సాఫ్ట్వేర్ లకి అడ్మినిస్ట్రేటర్.
20.ట్రేడ్ లైసెన్స్ ,లే అవుట్ ,భవన అనుమతులు.
ఆర్ధిక సంబంధమయిన విధులు
1.DDO [సచివాలయం ]
2.డిజిటల్ ట్రాన్స్కేషన్స్,ఆర్ధిక సంబధిత రిజిస్టర్ ల అప్డేట్.
3.బడ్జెట్ ,DCB తయారీ ఆడిట్.
4.GPDP మేరకు వివిధ శాఖలకు పధక / ప్రణాళిక నిధుల వినియోగం , U.C ల ను పంపడం
సామాజిక సంక్షేమం మరియు అభివృద్ధి విధులు
1.సామాజిక భద్రత, పెన్షన్స్ పంపిణి .
2.అభివృద్ధి కార్యక్రమాలు ,డేటా రెడీ చేసుకోవడం.
3.స్వయంసహాకార సంఘాలు ఏర్పాటు.
4.మండల పరిషత్ నిర్వహించు సమావేశాలకు హాజరగుట.
5.VTDA లలో మైక్రో ప్లాన్ ల తయారీ, అమలు.
6.ప్రజా భాగస్వామ్యంతో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక తయారీ.
7.వ్యవసాయ / ఉద్యాన / సెరికల్చర్ అధికారులతో సమన్వయం.
8.ఉపాధి హామీ కార్యక్రమాలు అమలు.
9.మొక్కలు పెంపకం, సహజ వనరులు సంరక్షణ.
10.G .P ఆస్తుల , అభివృద్ధికి సంబదించిన సమాచార బోర్డుల ఏర్పాటు., టాం టాం – ఇతర పద్దతుల పబ్లిసిటీ.
0 Comments
Thank you For Your Comment We Will Get In Touch You Soon