Q: రైస్ కార్డు ప్రింట్ ఇస్తుంటే " Card can't be printed as head of the family is not Available" అనివస్తుంది. అప్పుడు ఎం చెయ్యాలి?
A:పై సమస్య కార్డు విభజన చేసాక, VRO స్పందన లాగిన్ లో రిలేషన్స్ మార్చకుండా MRO డిజిటల్ సైన్ కు పంపడం వలన వస్తుంది. అలాంటి కార్డు లు ప్రింట్ కావు. వాలంటీర్ AePDS మొబైల్ అప్లికేషన్ నందు Ekyc సెక్షన్లో రైస్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి "Change Relationship", పై క్లిక్ చేసి ఒకరికి Self ఇచ్చి తరువాత రిలేషన్స్ ఇచ్చి Go To Ekyc పై క్లిక్ చేసి కుటుంబం లో ఏ ఒక్కరి బయోమెట్రిక్ అయినా తీసుకోవాలి. తరువా ఒక్క సారి మరల బ్యాక్ కు వచ్చి Ekyc లోన రైస్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి రిలేషన్స్స సరిచేసుకోవాలి. ఇలా చేసిన కొంత సమయం ( 2 లేదా 3 రోజులు సుమారుగా ) తరువాత కార్డు ప్రింట్ చూపించును.
Q:రైస్ కార్డు ప్రింట్ ఇచ్చిన తర్వాత అందులో జండర్ లేదా లింగము తప్పుగా అనగా స్త్రీకి పురుషునిగా పురుషునికి స్త్రీ గా నమోదు అయినట్లయితే దానిని ఏ విధంగా సరి చేసుకోవాలి?
A:పై సమస్య వచ్చిన వారికి వివరాలను మార్చడానికి అధికారికంగా ఎటువంటి విధానము లేనప్పటికీ ఒక విధంగా ప్రయత్నించినట్లయితే తప్పకుండా జెండర్ అనేది మారుతుంది . ఇక్కడ తప్పకుండా గుర్తుంచుకోవలసిన విషయము ఏమిటంటే రైస్ కార్డు లో జండర్ అనేది ఆధార్ కార్డు ను బేస్ చేసుకోని వస్తుంది, కావున తప్పుగా జెండర్ నమోదైన వారు ఆధార్ కార్డులో జండర్ సరిగా ఉన్నదో లేదో చెక్ చేసుకున్న తరువాత, గ్రామ వార్డు వాలంటీర్ ఉపయోగించే మొబైల్ అప్లికేషన్ AePDS లో eKYC సెక్షన్ రైస్ కార్డు నెంబర్ను ఎంటర్ వారి బయోమెట్రిక్ వేయవలెను. ఈ విధంగా చేసిన చాలా రోజుల తరువాత జెండర్ అనేది మారుతుంది. అప్పుడు రైస్ కార్డు ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది. టెస్ట్ చేసి విజయవంతం అయిన తరువాత ఈ పోస్ట్ పెట్టడం జరుగుతుంది గమనించండి.
Q:రైస్ కార్డు లో తప్పుగా ఉన్నటువంటి పేరును మార్చటం ఎలా?
A:పై సమస్య వచ్చిన వారికి వివరాలను మార్చడానికి అధికారికంగా ఎటువంటి విధానము లేనప్పటికీ ఆధార్ కార్డు లో ముందుగా పేరును ఏ విధం గా మార్చాలో అలా మార్చుకోవాలి, తరువాత వాలంటీర్ వద్ద ఉండే AePDS మొబైల్ అప్లికేషన్ లో అప్డేట్ eKYC సెక్షన్ లో రైస్ కార్డు నెంబర్ ను ఎంటర్ చేసి ఎవరి వివరాలు మార్చాలో వారి
Q:ఒకసారి రైస్ కార్డు ప్రింట్ తీసుకున్నది పోయినట్లయితే మరలా ప్రింట్ తీసుకునే వెసులుబాటు ఉంటుందా?
A:అవును, ఒక్కసారి ప్రింట్ ఇచ్చిన తరువాత ఎన్నిసార్లైనా ప్రింట్ తీసుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ ఏ సచివాలయం పరిధిలో రైస్ కార్డు ఆ సచివాలయంలో ప్రింట్ తీసుకున్నట్టయితే డిజిటల్ సంతకం ఆ సచికలయనిది వస్తుంది.
Q:కార్డు ప్రింటింగ్ కు ప్రభుత్వం నిర్ణయించిన ఛార్జ్ ఎంత?
A:ఇప్పటి వరకు ఉన్న ఉత్తర్వుల ప్రకారం రైస్ కార్డు ప్రింటింగ్ ఎటువంటి ఛార్జ్ అనేది లేదు. అప్లికేషన్ ఫీజు మాత్రం చెల్లిస్తే సరిపోతుంది.
0 Comments
Thank you For Your Comment We Will Get In Touch You Soon